సంతకాల ఫోర్జరీ కేసు.. కోర్టులో అప్పీల్ ఫైల్ చేసిన నిందితుడు
- November 14, 2021
బహ్రెయిన్: సంతకాలను ఫోర్జరీ చేసి పనిమనిషులను అక్రమంగా దేశంలోకి తెచ్చిన కేసులో 6 ఏండ్ల శిక్ష పడ్డ ఓ నిందితుడు బహ్రెయిన్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అతడి అప్పీల్ ను విచారించేందుకు కోర్టు అనుమతించింది. కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ప్రకారం.. నిందితుడుగా భావిస్తున్న వ్యక్తి.. ఇద్దరు వ్యక్తులకు తెలియకుండా వార్ల పేర్ల మీద పనిమనిషులను తీసుకొచ్చాడు. దీని కోసం అతడు వారి సంతకాలను ఫోర్జరీ చేశాడు. ఈ విషయం వాళ్లకు తెలియడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి విచారించారు. ఇతరుల పేర్లతో అక్రమంగా పనిమనిషులను తెచ్చినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దీంతో ఇతరుల సంతకాలను ఫోర్జరీ చేసి పనిమనుషులను అక్రమంగా తీసుకొచ్చిన కేసుల్లో క్రిమినల్ కోర్టు ఆరేండ్ల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..