తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశం ముగిసింది

- March 21, 2016 , by Maagulf
తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశం ముగిసింది

తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. ఆన్‌లైన్ టికెట్ల విధి విధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేయాలని, చిన్న సినిమాలకు ఊతం ఇచ్చేందుకు ఐదో షోను సా. 4 నుంచి ప్రదర్శించుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 50 థియేటర్లలోపు విడుదలైతే చిన్న సినిమాగా గుర్తించాలన్నారు. సినిమాలకు ఇచ్చే అవార్డు పేరును ఎంపిక చేసేందుకు ప్రభుత్వ సలహదారు రమణాచారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, స్థలం ఎంపికకు సినీ ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఈ భేటిలో నిర్ణయించారు. చిత్రపురి కాలనీ కోసం మరో 9 ఎకరాలు కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను సబ్‌కమిటీ ఆదేశించింది. థియేటర్లు లేని 150 మండల కేంద్రాల్లో 200లోపు సీట్లతో చిన్న థియేటర్ల నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. సినిమాలకు 48 గంటల్లోగా సింగిల్‌విండో విధానంతో అనుమతి ఇవ్వాలని, ఏ కారణం చూపకపోతే అనుమతి ఇచ్చినట్టు భావించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com