కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తైన విదేశీయులకే ఉమ్రాకు వచ్చేందుకు అనుమతి

- November 20, 2021 , by Maagulf
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తైన విదేశీయులకే ఉమ్రాకు వచ్చేందుకు అనుమతి

సౌదీ: ఉమ్రా యాత్రకు వచ్చే విదేశీయులకు సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను ప్రకటించింది. 18 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వారికి మాత్రమే ఈ ఉమ్రా యాత్ర కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించిన వ్యాక్సిన్‌ రెండు డోసులను విదేశీ యాత్రికులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ ఎంట్రీ వీసా పొందేందుకు యాత్రికులు తప్పనిసరిగా తమ టీకా సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా వీసా పొందవచ్చని ఉమ్రా, హజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. యాత్రికులు ప్రయాణించే ముందు, తమ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి  ట్రావెల్ ఏజెంట్లతో ఓసారి తనిఖీ చేయించుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి సౌదీ అరేబియా వెలుపల నుండి ఉమ్రా వీసా పొందాలనుకునే వారి కోసం సౌదీ మంత్రిత్వ శాఖ ‘‘ఈట్‌మార్నా, తవక్కల్నా’’ అనే రెండు యాప్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు మాత్రమే గ్రాండ్ మసీదు, ప్రవక్త మసీదులో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించడానికి అనుమతుల జారీని పరిమితం చేయాలని అధికారులు నిర్ణయించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీలో ఆమోదించబడిన వ్యాక్సిన్ రెండు డోసుల వ్యాక్సిన్‌ను పొందిన వారికి, వ్యాక్సిన్ తీసుకోకుండా మినహాయించబడిన కేసులకు మాత్రమే ప్రార్థనల నిబంధనలు పరిమితం అని మంత్రిత్వ శాఖ వివరించింది. రెండు వ్యాక్సిన్ మోతాదులను పూర్తి చేయకుండా ఉమ్రా, ప్రార్థన లేదా సందర్శన కోసం రిజర్వేషన్, పర్మిట్ జారీని పూర్తి చేసిన యాత్రికులు, పర్మిట్ తేదీకి 48 గంటల ముందు రెండవ డోస్ తీసుకోవాలని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com