వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించనున్న బ్రిటన్ !
- November 20, 2021
లండన్: చైనా రాజధాని బీజింగ్‌లో వచ్చే ఏడాది జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ను బ్రిటన్ బహిష్కరించే అవకాశం కనిపిస్తున్నది. మానవ హక్కులను చైనా కాలరాస్తున్నదని అందువల్ల దౌత్యపరంగా వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నారని స్థానిక వార్తా పత్రికలు తెలిపాయి.
ఒలింపిక్స్ బాయ్‌కాట్ దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని యూకే విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ పేర్కొన్నారు. కాగా, బ్రిటన్ మంత్రులతోపాటు, చైనాలో యూకే రాయబారి కూడా విశ్వ క్రీడల వేడుకల్లో పాల్గొనకూడదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌కు బీజింగ్ ఆతిథ్యమివ్వనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







