కనీస వేతనం ఓ అద్భుతమైన ముందడుగు!
- November 20, 2021
యూఏఈ: నైపుణ్యం కలిగిన కార్మికు కనీస వేతనం పొందే హక్కు చాలా ముఖ్యమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూఏఈ కార్మిక చట్టం కొత్తగా కనీస వేతనాన్ని ప్రైవేటు సెక్టార్ ఉద్యోగుల కోసం అందుబాటులోకి తెస్తోంది. 2022 ఫిబ్రవరి నుంచి ఇది అమలు కానుంది. ఆర్టికల్ 27 డిక్రీ చట్టం నెంబర్ 33 - 2021 ద్వారా కనీస వేతనాన్ని అమలు చేయనున్నారు. గలదారి లడ్వొకేట్స్ మరియు లీగల్ కన్సల్టెంట్స్ సీనియర్ పార్టనర్ అబ్దుల్లా జైద్ గలదారి మాట్లాడుతూ, ఈ నిర్ణయం అద్భుతమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రైవేటు రంగం మరింత నిష్ణాతుల్ని నియమించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. పరస్పర అంగీకారంతో గతంలో వేతనాలు కరారయ్యేవి. క్యాబినెట్ ఎప్పుడైతే కనీస వేతనం దిశగా అడుగులు వేసిందో, యజమానులెవరూ ఈ చట్టాన్ని ఉల్లంఘించడానికి వీల్లేకుండా పోతుంది. తద్వారా కార్మికులు లేదా ఉద్యోగులకు వేతన రక్షణ లభిస్తుంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







