'మేడ్ ఇన్ ఒమన్' బస్సులు వచ్చేశాయి
- November 21, 2021
ఒమన్: 'మేడ్ ఇన్ ఒమన్' మొదటి బ్యాచ్ బస్సుల డెలివరీ ప్రారంభమైంది. దుక్మ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని కార్వా మోటార్స్ ఈ బస్సులను తయారు చేస్తోంది. ఒమానీ-ఖతారీ జాయింట్ వెంచర్ అయిన ఈ ప్రాజెక్ట్.. ఒమన్ 51వ నేషనల్ డే నేపథ్యంలో ప్రారంభిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి 200 బస్సులను తయారు చేయాలని యోచిస్తున్నట్లు కార్వా మోటార్స్ ప్రకటించింది. ఏటా దాదాపు 500-700 వరకు బస్సులను తయారు చేయనుంది. ముందుగా స్కూల్ బస్సులను తర్వాత రవాణా సంస్థలకు, సుదూర అంతర్-నగర ప్రయాణాల అవసరాలకు మేరకు బస్సులను తయారు చేస్తామని అన్నారు. భవిష్యత్ లో ఎలక్ట్రిక్ కోచ్‌లను కూడా ఉత్పత్తి చేస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. 70 శాతం వాటాతో ఖతార్‌లోని జాతీయ రవాణా సంస్థ అయిన ఖతార్ ట్రాన్స్ పోర్ట్, ఒమన్ సుల్తానేట్ సమగ్ర సార్వభౌమ సంపద నిధి అయిన ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (OIA) అనుబంధ సంస్థ అయిన ఖతార్ ట్రాన్స్ పోర్ట్ ల వ్యూహాత్మక భాగస్వామ్యంతో కార్వా మోటార్స్ ను ప్రారంభించారు. ఈ కీలక ప్రాజెక్ట్ కోసం 30 శాతం నిధులను కార్వా మోటార్స్ స్వంతంగా సమకూర్చుకుంది. ప్రాజెక్ట్ లో మొదటి దశ 90 మిలియన్ల డాలర్లు, రెండు దశల్లో 270 మిలియన్ల డాలర్లు పెట్టనున్నారు. భారత్ కు చెందిన మల్టీడిసిప్లినరీ డిజైన్, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ సెమాక్ కన్సల్టెంట్స్ అనుబంధ సంస్థ సెమాక్ ఒమన్ బస్సులకు డిజైన్లు అందిస్తోంది. చైనా MMI ప్లానింగ్ & ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్రధాన సలహాదారుగా ఉంది. సుల్తానేట్‌లో ఆటోమోటివ్ తయారీ పరిశ్రమను ఈ ప్లాంట్ మరింత అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విడిభాగాలు, ఉపకరణాలు ప్రారంభంలో విదేశీ సరఫరాదారుల నుండి తీసుకుంటున్నప్పటికీ, తర్వాత కాలంలో స్థానికంగా ఉత్పత్తి చేసే దిశగా ప్రయత్నిస్తామని, స్థానిక వెంచర్లకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తామని కార్వా మోటార్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







