సరైన ఆధారాలు లేవు...ఓ వ్యక్తి మరణం కేసులో నిందితుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు
- November 21, 2021
బహ్రెయిన్: నిర్లక్షపూరితంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడన్న కారణంతో పోలీసులు పెట్టిన కేసును హై క్రిమినల్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న దానికి సరైన ఆధారాలను ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేయలేదని తెలిపింది. తన తోటి వ్యక్తి మరణానికి అతను కారణం కాదని తేల్చింది. కొన్ని రోజుల క్రితం ఓ ఫ్యాక్టరీలోని బాయిలర్ లో మంటలు చెలరేగి ఓ వ్యక్తి చనిపోయాడు. ఐతే తన తోటి ఎంప్లాయి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బాయిలర్ బాటన్ ఆన్ చేయటం కారణంగానే అతను చనిపోయినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే విచారణలో భాగంగా సీసీటీవీని ఫుటేజ్ ను కోర్టు పరిశీలించింది. ఇందులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి తప్పేమీ లేదని క్లియర్ గా కనబడుతుందని కోర్టు తేల్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చేలరేగాయని స్పష్టం చేసింది. 14 హియరింగ్స్ తర్వాత ఈ కేసులో నిందితుడిని నిర్దోషని తేల్చుతూ కోర్టు తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









