‘ICOM 2025’ నిర్వహణకు ఆతిథ్యమివ్వనున్న దుబాయ్

- November 21, 2021 , by Maagulf
‘ICOM 2025’ నిర్వహణకు ఆతిథ్యమివ్వనున్న దుబాయ్

దుబాయ్: 2025లో జరగనున్న 27వ జనరల్ కాన్ఫరెన్స్ కు ఆతిథ్య నగరంగా దుబాయ్‌ని అంతర్జాతీయ మ్యూజియంల సలహా మండలి (ICOM) ఎంపిక చేసింది. ICOM 2025 నిర్వహణ హక్కులను గెలుచుకున్నందుకు దుబాయ్‌ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంతోషం వ్యక్తం చేశారు. "119 కౌంటీలు, 20,000 అంతర్జాతీయ మ్యూజియంలను కవర్ చేసే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం కాన్ఫరెన్స్ అయిన ICOM 2025కి దుబాయ్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది అభివృద్ధి చెందుతున్న UAE సంస్కృతి రంగాన్ని పటిష్టం చేస్తుంది" అని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. జూన్‌లో 2021 వార్షిక సమావేశాల సందర్భంగా ముగ్గురు పోటీదారులు  ICOM 2025 నిర్వహణ హక్కుల కోసం పోటీలో నిలిచారు. రష్యా ప్రతిపాదించిన కజాన్, స్వీడన్ ప్రతిపాదించిన స్టాక్‌హోమ్, యూఏఈ ప్రతిపాదించిన దుబాయ్ పోటీ పడ్డాయి. నవంబర్ 18-19 తేదీలలో జరిగిన ICOM 90వ సలహా మండలి.. 27వ సాధారణ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి దుబాయ్‌ ఎంపిక అయ్యింది. ఛేంజ్, రీకన్ స్ట్రక్షన్, యాక్సెసిబిలిటీ, ట్రాన్ పారెన్సీ పై దృష్టి సారించి, వేగంగా మారుతున్న కమ్యూనిటీలలో మ్యూజియమ్‌ల భవిష్యత్తు అనే థీమ్‌పై కాన్ఫరెన్స్ ను నిర్వహించేందుకు ICOM లో UAE బిడ్‌ను సమర్పించింది. ప్రతి మూడు సంవత్సరాలకు, అంతర్జాతీయ మ్యూజియం కమ్యూనిటీ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తుంది. 1948లో ICOM జనరల్ కాన్ఫరెన్స్ ప్రారంభమవ్వగా..  ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారాలను చూపే ప్రసిద్ధ కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com