ఇరాన్ లో సగానికిపైగా జనాభాకు కరోనా వ్యాక్సిన్

- November 21, 2021 , by Maagulf
ఇరాన్ లో సగానికిపైగా జనాభాకు కరోనా వ్యాక్సిన్

టెహ్రాన్‌:ఇరాన్‌ దేశంలో సగానికిపైగా జనాభా పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్‌లో మొత్తం 8 కోట్ల 30 లక్షల మంది ఉండగా ఇప్పటివరకు 4 కోట్ల 42 లక్షలకుపైగా జనాభా రెండు డోసులు తీసుకున్నారని వెల్లడించింది. మరో కోటీ 22 లక్ష మంది వ్యాక్సిన్‌ మొదటి డోసు వేసుకున్నారని చెప్పారు.ఇందులో చైనాలో తయారైన సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌ కూడా ఉంది.

ఇరాన్‌లో 60 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,29,000 మంది మరణించారు. అయితే దేశంలో నమోదైన కేసులను అధికారులు తక్కువగా చూపించారని ఆరోపణలు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com