రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..
- November 21, 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. భారీగా పోటెత్తుతున్న వరదలతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పలు గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రహదారులు కోతకు గురయ్యాయి. దీంతోపాటు రైలు పట్టాలపైకి వరద నీరు చేరాయి. దీంతో రైలు పట్టాలు భారీగా కొతకు గురై రైళ్ల సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కాగా..ఏపీలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మరి కొన్ని దారి మళ్లించినట్టు తెలిపింది. అత్యధికంగా వరదలు పోటెత్తిన నెల్లూరు- పడుగపాడు మార్గంలో 18 రైళ్లు రద్దు చేయగా, రెండు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. 10 రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ట్విట్ చేసింది.
రద్దయిన రైళ్ల సర్వీసుల వివరాలు..
20895 రామేశ్వరం- భువనేశ్వర్
22859 పూరి- చెన్నె సెంట్రల్
17489 పూరి- తిరుపతి
12655 అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్
12967 చెన్నై సెంట్రల్- జైపూర్
06426 నాగర్‌సోల్- తిరువనంతపురం
06427 తిరువనంతపురం- నాగర్‌సోల్
06425 కొల్లాం- తిరువనంతపురం
06435 తిరువనంతపురం- నాగర్‌సోల్
12863 హౌరా- యశ్వంతపూర్
12269 చెన్నై సెంట్రల్- హజరత్ నిజముద్దీన్ ఢిల్లీ
12842 చెన్నై సెంట్రల్- హౌరా
12656 చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్
12712 చెన్నై సెంట్రల్- విజయవాడ
12510 గువహటి- బెంగళూరు కంటోన్మెంట్
15930 న్యూ తినుసుకియా – తాంబరం
20890 తిరుపతి- హౌరా
17651 చెంగల్‌పట్టు – కాచిగూడ
దారి మళ్లించిన రైళ్ల సర్వీసుల వివరాలు..
12642 హజరత్ నిజాముద్దీన్- కన్యాకుమారి
12616 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్
22877 హౌరా- ఎర్నాకుళం
12845 భువనేశ్వర్- బెంగళూరు కంటోన్మెంట్
22502 న్యూ తిన్‌సుకియా- బెంగళూరు
12270 హజరత్ నిజాముద్దీన్- చెన్నై సెంట్రల్
12655 అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్
12622 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్
12296 దానపూర్- బెంగళూరు
12968 జైపూర్- చెన్నై సెంట్రల్
తాత్కలికంగా నిలిపివేసిన ట్రైన్లు..
15906 డిబ్రూగఢ్ – కన్యాకుమారి రైలు, 12708 హజరత్ నిజాముద్దీన్- తిరుపతి రైలును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం