అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- February 18, 2026
న్యూ ఢిల్లీ: భారత రైల్వే శాఖ అమృత్ భారత్ స్లీపర్ రైళ్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే సామాన్య ప్రయాణికుల కోసం నాన్ ఏసీ కోచ్‌లతో అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే, ఇప్పుడు అప్గ్రేడ్ వెర్షన్‌గా అమృత్ భారత్ 3.0 రైళ్లను తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం వందే భారత్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బడ్జెట్‌లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను కూడా ప్రకటించగా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
అమృత్ భారత్ 3.0లో కొత్త ఫీచర్లు
ప్రస్తుతం అమృత్ భారత్ 1.0, 2.0 వెర్షన్ రైళ్లు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. వీటిలో నాన్ ఏసీ జనరల్ మరియు స్లీపర్ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే త్వరలో రానున్న అమృత్ భారత్ 3.0 రైళ్లలో ఏసీ కోచ్‌లను కూడా జోడించనున్నారు. ఈ కొత్త వెర్షన్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు చివర్లలో లోకోమోటివ్‌లు ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు.
ఏప్రిల్‌లో ప్రారంభానికి సన్నాహాలు
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం రెండు అమృత్ భారత్ 3.0 రైళ్ల తయారీ జరుగుతోంది. రైళ్ల తయారీ పూర్తయ్యాక వాటిని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌కు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని అనుమతులు పూర్తయిన తర్వాత ఏప్రిల్ నాటికి ఈ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 50 అమృత్ భారత్ 3.0 రైళ్లను తయారు చేసే బాధ్యతను చెన్నై కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా, వాటిలో మూడు రైళ్లు తమిళనాడు నుంచి సేవలందిస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







