తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- February 18, 2026
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరుగుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ నగర ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మార్చి ఒకటో తేదీ నుంచి ఎండాకాలం పూర్తయ్యే వరకు అంటే మే నెలాఖరు వరకు హైదరాబాద్ (Hyderabad) సిటీ ఏసీ సర్వీసుల్లో టికెట్ ఛార్జీలు 30 శాతం తగ్గించనున్నట్లు తెలిసింది. హైదరాబాద్ జోన్‌లో మాత్రమే అమల్లోకి రానుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ ఛార్జీలకు సమానంగా ఏసీ బస్సుల్లోనూ ఛార్జీలు ఉండనున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు తిరిగే పుష్పక్ ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని ఏసీ బస్సుల్లో ఈ టికెట్ తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తిరుగుతుండగా వీటిలోనే ఛార్జీల తగ్గింపును ఆర్టీసీ అధికారులు అమలుచేయనున్నారు. ఏసీ బస్సుల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని ఆశ్రయించలేకపోతున్నారు. తాజాగా ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రయాణికలుక ఊరట లభించనుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరతోనే ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిచటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







