హైదరాబాద్ లో వర్చువల్ రియాలిటీ టెక్నో పార్క్

- November 22, 2021 , by Maagulf
హైదరాబాద్ లో వర్చువల్ రియాలిటీ టెక్నో పార్క్

హైదరాబాద్: భారతదేశంలో తొలిసారిగా ఆగ్ మెంట్ రియాలిటీ (ఎఆర్) వర్చువల్ రియాలిటీ (ఎఆర్)సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధనలు, ఆవిష్కరణలతో కూడిన సైమాక్స్ టెక్నోపార్క్ ను హైదరాబాదులో నెలకొల్పుతున్నట్లు సంస్థ చైర్మన్ జి. రాఘవరెడ్డి, సిఇఓ గౌరిశంకర్ లు వెల్లడించారు. సోమవారం నాడు ఉదయం హైదరాబాదు సైమాక్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి దగ్గరలో అత్యంత సువిశాలమైన 32 ఎకరాల స్థలంలో సైమాక్స్ టెక్నోపార్క్ ను ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

ఇది స్టార్టప్ కం పెనీలతోపాటు, అగ్రశ్రేణి కంపెనీలు సైతం ఎఆర్, విఆర్ పరిజ్ఞానాన్ని భవిష్యత్తుకు తగిన విధంగా అభివృద్ధి చేసుకోవడానికి ఒక వేదికగా నిలబడి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే సైమాక్స్ ఇన్ఫోటైన్ మెంట్ సంస్థ ద్వారా సైమాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ, విఆర్ ల్యాబ్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్, విఆర్ మూవీస్ ఇన్ వెబ్ సీరిస్, సైమాక్స్ ఫిల్మ్ మ్యూజియం, వర్చువల్ ప్రొడక్షన్స్, వర్చువల్ ఆర్కిటికెక్చర్ అండ్ రియల్ ఎస్టేట్, సైమాక్స్ ఇండోర్ థియేటర్, సైమాక్స్ అవుట్ ర్ థియేటర్, వర్చువల్ టివి/ స్టూడియో టూర్స్/ షో రూమ్స్/ వర్చువల్ ఈవెంట్స్ 360 డిగ్రీల స్ట్రీమింగ్ వంటి అనేక రకాలైన ఆవిష్కరణలను ఈ పార్కులో తీసుకువస్తున్నామని తెలిపారు.

అలాగే విశిష్టమైన సైమాక్స్ కోర్సులను మల్టీమీడియా, విఎఫ్ఎక్స్, సాఫ్ట్ వేర్ రంగాలకు అనుబంధంగా తీసుకువస్తున్నామన్నారు.ఈ కోర్సుతో గేమింగ్, విద్య, వినోదం, వైద్యం, ఆటోమొబైల్, టూరిజం, రియల్ ఎస్టేట్, మిలిటరీ, ఆర్కిటెక్చర్, ఆటోమోటివ్, హెల్త్ కేర్,
రీటైల్, లెర్నింగ్ అండ్ డెవలప్ మెంట్, రిక్రూట్‌మెంట్, స్పోర్ట్స్, ఈవెంట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, ఆర్ట్ అండ్ డిజైన్, చారిటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్, రిక్రియేషన్, లా ఎన్ ఫోర్స్ మెంట్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు దోహదపడటంతోపాటు విస్తృతంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు.అదే విధంగా సైమాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ విద్యార్థులను భవిష్యత్తులో ఎదురయ్యే మేథోసవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కునే విధంగాను, విభిన్న సంస్కృతులతో కలిసి ప్రయాణం చేసే విధంగా తీర్చిదిద్దుతుందన్నారు. విదేశాలకు ధీటుగా ఇక్కడి యువతతోపాటు, \ఉద్యోగులు, మహిళలు, వివిధ రంగాల వృత్తి నిపుణులు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలన్నింటిలోను ఎఆర్, విఆర్ సాంకేతిక విద్యను, పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో సైమాక్స్ ముఖ్యభూమికను పోషించనున్నదన్నారు.

కృత్రిమ మేథస్సు, మిషన్ లెర్నింగ్ లతో పాటు ఎఆర్, విఆర్, ఎంఆర్ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచగమనాన్ని సరికొత్తగా ప్రజల ముందు ఆవిష్కరించడానికి సిద్ధమవుతోందన్నారు. ముఖ్యంగా చరిత్రలో ఏ కాలానికైనా వెళ్ళగలగడం, చంద్రమండలం మీదకు వెళ్ళిఆస్వాదించడం, మన బలహీనతల్ని సైతం జయించి కలల ప్రపంచంలోకి దూసుకెళ్ళడం, వృద్ధాప్యాన్ని జయించడం, మరణానంతరం కూడా డిజిటల్ వరల్డ్ లో జీవించి వుండేలా చెయ్యడం కూడా ఎఆర్, విఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమవుతుందన్నారు.

ప్రపంచంలో ప్రతిభకు, పరిశోధనలకు, ఆవిష్కరణలకు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కు కేంద్రబిందువుగా నిలబడి, ప్రభావవంతమైన విద్యను,నైపుణ్యాలను అందించడం ద్వారా సమాజానికి అవసరమైన వృత్తి నాయకత్వాన్ని తయారు చేసే విధంగా సైమాక్స్ సేవలందిస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com