మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతుల హర్షం
- November 22, 2021
అమరావతి: మూడు రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతం, మహాపాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
3 రాజధానులు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసింది. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని.. మహాపాదయాత్ర కొనసాగుతుందని ఐకాస వెల్లడించింది. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదని అమరావతి ఐకాస స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్‌లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్‌లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..







