ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావంపై ప్రధానితో మాట్లాడిన ఉపరాష్ట్రపతి
- November 22, 2021
ఏపీ: ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని వరద పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ఈరోజు ఉదయం ఫోన్ ద్వారా రాష్ట్రంలో వరద పరిస్థితిని వారికి వివరించారు.
రాష్ట్రంలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాలను, భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రధానికి తెలియజేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రితోనూ ఫోన్లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, వరద ప్రభావం గురించి కూలంకషంగా వివరించారు. వరద సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు.
ఉపరాష్ట్రపతి తెలియజేసిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి తమవైపు నుంచి ఇప్పటికే సహకారాన్ని అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ అవసరమైన సహకారాన్ని అందజేస్తామని ఉపరాష్ట్రపతికి వివరించారు.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









