2 ఎమిరేట్లలో ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్
- November 22, 2021
యూఏఈ: ట్రాఫిక్ జరీమానాల విషయమై వాహనదారులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకోసం షార్జా మరియు అజ్మన్‌లలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ట్రాఫిక్ జరీమానాల ఉద్దేశ్యం, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడమే తప్ప, వాహనారులపై ఆర్థిక భారం మోపడం కాదు. కాగా, షార్జా మోటరిస్టులు నవంబర్ 21 (2021) నుంచి జనవరి 31 (2022) మధ్య డిస్కౌంట్లను పొందవచ్చు. అజ్మన్‌లో అయితే నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే నలభై రోజులపాటు డిస్కౌంటుని వినియోగించుకోవచ్చు. అన్ని ఉల్లంఘనలకూ ఈ డిస్కౌంట్ వర్తించదు. షార్జాలో నవంబర్ 21కి ముందు జారీ అయిన జరీమానాలకే డిస్కౌంట్ వర్తిస్తుంది. నవంబర్ 14 ముందు నమోదైన జరీమానాలకు అజ్మన్‌లో డిస్కౌంట్ వర్తిస్తుంది. రెడ్ సిగ్నల్ జంపింగ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు షార్జాలో జరీమానా డిస్కౌంట్ లభించదు. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, లైసెన్సు లేకుండా వాహన ఇంజిన్ మార్పుకి సంబంధించిన ఉల్లంఘనలపై జరీమానాలకు డిస్కౌంట్ అజ్మన్‌లో వర్తించదు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!







