కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర: అవార్డును స్వీకరించిన కుటుంబ సభ్యులు

- November 23, 2021 , by Maagulf
కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర: అవార్డును స్వీకరించిన కుటుంబ సభ్యులు

న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దులోని గాల్వాన్ లో వీరోచితంగా పోరాటం చేసి వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కు మహవీర్ చక్ర అవార్డు దక్కింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ బాబు కుటుంబసభ్యులు మంగళవారం నాడు ఈ అవార్డును స్వీకరించారు.గత ఏడాది జూన్ మాసంలో గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు , నాయబ్ సుబేదార్, సుదురామ్ సోరేన్, హవల్దార్ కె. పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయి గుర్తేజ్ సింగ్ లు మరణించారు. వీరికి మరణించిన తర్వాత వీర చక్రాలను ప్రకటించింది కేంద్రం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com