1000 కోట్లివ్వాలని ప్రధానికి జగన్ వినతి పత్రం..
- November 24, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద సహాయం కింద రూ. 1000 కోట్లు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు జగన్.ఇవాళ ఉదయం ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇంచార్జీలతో సీఎం సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయా ప్రాంతాల్లో పంట నష్టం, ప్రాణ నష్టం గురించి ఆరా తీశారు. ప్రాథమికంగా ఆయా జిల్లాల్లో జరిగిన నష్టాల గురించి కూడా సీఎం ఆరా తీశారు. మరో వైపు ఆయా ప్రాంతాల్లో నష్టంపై సమగ్రంగా నివేదికను తయారు చేయాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల కారణంగా చోటు చేసుకొన్న నష్టంపై అధికారులు ప్రాథమికంగా నష్టం అంచనాలను తయారు చేశారు. ఈ నష్టం అంచనా ఆధారంగా సీఎం జగన్ ప్రధాని మోడీ ని రూ.1000 కోట్లు ఇవ్వాలని కోరారు. మరో వైపు రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కూడా సీఎం జగన్ ఆ లేఖలో కోరారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..