రివేంజ్ డ్రామాగా ఎన్టీఆర్ '30'..
- November 24, 2021
రివేంజ్ డ్రామాగా ఎన్టీఆర్ '30' తెరకెక్కబోతోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా మొదలబోతోంది.
ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని అలాగే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను పూర్తి చేసిన తారక్ తన భార్య, పిల్లలతో కలిసి యూరప్ ట్రిప్‌కి వెళ్ళాడు. ఈ ట్రిప్ నుంచి రాగానే కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలవబోతున్నాయి.
ఒకవైపు ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే కొరటాల సినిమా షూటింగ్‌కు హాజరవనున్నాడు తారక్. కాగా, ఈ సినిమా రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని.. పూర్తిగా కొరటాల మార్క్‌తో ఉండబోతోందని స్వయంగా ఎన్టీఆర్ వెల్లడించాడు. ఇక అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే సమ్మర్ కానుకగా ఎన్టీఆర్ '30' ప్రేక్షకులముందుకు రానుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..