యూఏఈ జాతీయ దినోత్సవాన్ని 'అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవం'గా నిర్వహించనున్న ప్రపంచం

- November 26, 2021 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవాన్ని \'అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవం\'గా నిర్వహించనున్న ప్రపంచం

దుబాయ్: ఐక్యరాజ్యసమితి ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో), యూఏఈ జాతీయ దినోత్సవాన్ని అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవంగా అన్ని దేశాల్లోనూ నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈ సాధించిన విజయాలకు ఇదొక గౌరవ సూచకంగా భావించవచ్చు. యూఏఈ ప్రధాని మరియు ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డిసెంబర్ 2న యూఏఈ జాతీయ దినోత్సవం కాగా, ఇకపై అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవంగా కూడా నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో యూఏఈ సాధించిన విజయాల నేపథ్యంలో యూఏఈకి ఈ గుర్తింపు దక్కిందనీ, యూఏఈ ప్రపంచ దేశాలకు అభివృద్ధి విషయంలో మార్గదర్శకంగా మారిందని అన్నారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com