డిజిటల్ బ్యాంకుల నిర్వహణ కోసం ఆపరేటింగ్ లైసెన్సులు

- November 26, 2021 , by Maagulf
డిజిటల్ బ్యాంకుల నిర్వహణ కోసం ఆపరేటింగ్ లైసెన్సులు

సౌదీ: సౌదీ సెంట్రల్ బ్యాంక్, మరిన్ని డిజిటల్ బ్యాంకులకు లైసెన్సుల్ని మంజూరు చేయనుంది. తొలిసారిగా సౌదీ అరేబియాలో డిజిటల్ బ్యాంకులకు లైసెన్సుల్ని మంజూరు చేశారు. వీటిల్లో ఎస్‌టిసి బ్యాంకు, సౌదీ డిజిటల్ బ్యాంకు వున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో మంత్రి మండలి రెండు స్థానిక డిజిటల్ బ్యాంకులకు లైసెన్సుని ఆమోదించడం జరిగింది. ఎస్‌టిసి పే నుంచి ఎస్‌టిసి బ్యాంకుగా మార్పు కోసం (2.5 బిలియన్ సౌదీ రియాల్స్‌తో), రెండో బ్యాంకు సౌదీ డిజిటల్ బ్యాంకు కోసం 1.5 బిలియన్ క్యాపిటల్‌తో అనుమతులు జారీ చేశారు. సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ, మనీ లాండరింగ్ మీద పోరాటం, టెరర్రిస్టు ఫండింగ్ తదితర విభాగాల్లో డిజిటల్ బ్యాంకులు సమర్థవంతంగా సూపర్‌విజన్ చేస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com