ఓ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమం...హెలిక్యాప్టర్ ద్వారా హాస్పిటల్ కు తరలించిన RAF
- November 27, 2021
మస్కట్: ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ తమ వంతు ప్రయత్నం చేసింది. సకాలంలో ఆ చిన్నారిని నార్త్ అల్ బాటియా గవర్నరేట్ పరిధిలోని సోహర్ హాస్పిటల్ కు రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలిక్యాప్టర్ లో ఎయిర్ లిఫ్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే ముసనందమ్ గవర్నరేట్ పరిధిలోని దిబ్బ హెల్త్ కేర్ సెంటర్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న ఓ చిన్నారి పరిస్థితి క్రిటికల్ గా మారింది. వెంటనే మరింత మెరుగైన వైద్యం కోసం నార్త్ బాటియా గవర్నేట్ పరిధిలోని సోహర్ హాస్పిటల్ కు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని డాక్టర్లు రాయల్ ఎయిర్ ఫోర్స్ దృష్టికి తీసుకెళ్లటంతో వెంటనే అధికారులు స్పందించారు. అప్పటికప్పుడు హెలిక్యాప్టర్ ను ఏర్పాటు చేసి చిన్నారిని సోహర్ హాస్పిటల్ కు తరలించారు. సకాలంలో హాస్పిటల్ కు చేరటంతో చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు చేసిన మంచి పనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఆ చిన్నారికి మంచి ట్రీట్ మెంట్ అంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









