వృద్ధాశ్రమంలో కరోనా కలకలం..67 మందికి నిర్ధారణ

- November 29, 2021 , by Maagulf
వృద్ధాశ్రమంలో కరోనా కలకలం..67 మందికి నిర్ధారణ

 ముంబై: మహారాష్ట్ర థానేలోని ఒక వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేగింది. ఏకంగా ఆశ్రమంలోని 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.

వీరిలో ఐదుగురు వృద్ధాశ్రమ సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరందరూ కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారని అన్నారు. ఆశ్రమంలో ఉంటున్న ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటూ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో శనివారం భివాండి జిల్లా సొర్గావ్‌ గ్రామంలోని మాతోశ్రీ వృద్ధాశ్రమాన్ని సందర్శించినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. ఇక్కడ ఉన్న 109 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. దాంతో ఆశ్రమంలోని 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని తెలిసింది. వారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

మొత్తం 1,130 మంది జనాభా ఉన్న సొర్గావ్‌ గ్రామాన్ని ఈ మేరకు కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. థానే జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన క్లస్టర్‌లలో అతి పెద్ద క్లస్టర్‌ ఇదేనని అన్నారు. 15 మంది శాంపిల్స్‌ను జినోమ్‌ స్వీక్వెన్సింగ్‌ కోసం పంపామని డా.కైలాష్‌ పవార్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com