‘లక్ష్య’ ట్రైలర్ విడుదల చేసిన వెంకీ
- November 29, 2021
హైదరాబాద్:ఇటీవల ‘వరుడు కావాలెను’తో హిట్ కొట్టిన నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్రను పోషించారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమా కోసం నాగశౌర్య విలువిద్యలో శిక్షణ తీసుకోవడం విశేషం. మరి ‘లక్ష్య’తో నాగశౌర్య మరోహిట్ ను ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







