‘లక్ష్య’ ట్రైలర్ విడుదల చేసిన వెంకీ
- November 29, 2021హైదరాబాద్:ఇటీవల ‘వరుడు కావాలెను’తో హిట్ కొట్టిన నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్రను పోషించారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమా కోసం నాగశౌర్య విలువిద్యలో శిక్షణ తీసుకోవడం విశేషం. మరి ‘లక్ష్య’తో నాగశౌర్య మరోహిట్ ను ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..