COVID-19 ట్రావెల్ అండ్ రిటర్న్ పాలసీ అప్‌డేట్..
- November 30, 2021
ఖతార్: ఒమిక్రాన్ నేపథ్యంలో COVID-19 ట్రావెల్ అండ్ రిటర్న్ పాలసీని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) అప్‌డేట్ చేసింది. కరోనా తీవ్రత ఆధారంగా ప్రపంచ దేశాలను అసాధారణ రెడ్, రెడ్, గ్రీన్ జాబితాలో చేర్చింది. గ్రీన్ లిస్ట్ లో 175 దేశాలు ఉండగా.. రెడ్ లిస్ట్‌లో UK, UAEతో సహా 21 దేశాలు ఉన్నాయి. అసాధారణమైన రెడ్ లిస్ట్ లో ఇండోనేషియా, బోట్స్వానా, ఈజిప్ట్, ఈశ్వతిని, లెసోతో, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేతోసహా 16 దేశాలను చేర్చింది. ఆయా దేశ వివరాలు MoPH తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
జాబితాల ఆధారంగా వేర్వేరు విధానాలను జారీ చేసింది.
గ్రూప్ A: సిటిజన్స్, GCC సిటిజన్స్, ఖతార్ సిటిజన్స్
క్వారంటైన్ పాలసీ: పూర్తిగా టీకాలు వేసిన, టీకాలు వేయని
ప్యాసింజర్స్:
ఈ ప్రయాణికులు దేశానికి చేరుకున్న తర్వాత 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌కు లోబడి ఉండాలి. కావాలనుకుంటే హోటల్ క్వారంటైన్ ను ఎంచుకోవచ్చు.
టెస్టింగ్ విధానం:
రాక ముందు: ఖతార్ చేరుకోవడానికి ముందు 72 గంటలలోపు PCR పరీక్ష (నెగిటివ్)ను చేసుకోవాలి.
వచ్చిన తర్వాత: హోమ్ క్వారంటైన్ విషయంలో (అన్ని వయసుల వారు): ఓడరేవులలో ఒకదానిలో ఖతార్ చేరుకున్నప్పుడు, ఆరవ రోజున PCR పరీక్ష తప్పనిసరి. పరీక్షల్లో నెగిటివ్ వస్తే.. క్వారంటైన్ నుండి విడుదల చేయబడతారు.
హోటల్ క్వారంటైన్ విషయంలో (అన్ని వయసుల వారు): వచ్చిన తర్వాత క్వారంటైన్ లో మొదటి రోజు, ఆరవ రోజున PCR పరీక్ష చేయబడుతుంది. పరీక్షల్లో నెగిటివ్ వస్తే.. క్వారంటైన్ నుండి విడుదల చేయబడతారు.
B- GCC పౌరులు
క్వారంటైన్ పాలసీ: పూర్తిగా టీకాలు వేసిన, టీకాలు వేయని ప్రయాణికులు:
ఈ ప్రయాణికులు ఖతార్ చేరుకున్న తర్వాత 7 రోజుల పాటు హోటల్ క్వారంటైన్ లో నిబంధనలకు లోబడి ఉండాలి.
పరీక్ష విధానం:
రాక ముందు: ఖతార్‌కు చేరుకోవడానికి ముందు 72 గంటలలోపు PCR పరీక్ష (నెగిటివ్)ను ఉండాలి. వచ్చిన తర్వాత: వచ్చిన తర్వాత క్వారంటైన్ లో మొదటి, ఆరవ రోజున (అన్ని వయస్సుల వారు) PCR పరీక్ష చేయబడుతుంది. పరీక్షల్లో ఫలితం నెగిటివ్ ఉంటే, ఆ వ్యక్తిని ఏడవ రోజు (అన్ని వయస్సుల వారు) క్వారంటైన్ నుండి విడుదల చేస్తారు.
సి- ఖతార్ సిటిజన్స్
క్వారంటైన్ పాలసీ:
1. పూర్తిగా టీకాలు వేసిన ప్రయాణికులు: ఈ ప్రయాణికులు ఖతార్ చేరుకున్న తర్వాత 7 రోజుల పాటు నిర్బంధానికి లోబడి ఉంటారు:2 రోజుల పాటు హోటల్ క్వారంటైన్.. 5 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి.
టెస్టింగ్ విధానం:
రాక ముందు: ఖతార్‌కు చేరుకోవడానికి ముందు 72 గంటలలోపు PCR పరీక్ష (నెగిటివ్) సర్టిఫికెట్ ఉండాలి.
వచ్చిన తర్వాత: వచ్చిన తర్వాత హోటల్ క్వారంటైన్ లో మొదటి రోజు, ఆరవ రోజున (అన్ని వయస్సుల వారు) PCR పరీక్ష చేయబడుతుంది. పరీక్ష ఫలితం నెగిటివ్ ఉంటే క్వారంటైన్ నుండి విడుదల చేస్తారు.
1.PCR టెస్ట్ చేయవలసిన స్థలాలు:
హోటల్ క్వారంటైన్ విషయంలో: హోటల్
హోమ్ క్వారంటైన్ విషయంలో: ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కార్పొరేషన్ హెల్త్ సెంటర్స్. ఈ పరీక్షను నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ ద్వారా లైసెన్స్ పొందిన ప్రైవేట్ క్లినిక్‌లు/ఆసుపత్రులు.
2. టీకాలు వేయని ప్రయాణికులు:
ఈ ప్రయాణికులు ఖతార్ చేరుకున్న తర్వాత 7 రోజుల పాటు హోటల్ క్వారంటైన్ లో నిబంధనలకు లోబడి ఉండాలి.
టెస్టింగ్ విధానం:
రాక ముందు: ఖతార్‌కు చేరుకోవడానికి ముందు 72 గంటలలోపు PCR పరీక్ష (నెగిటివ్) సర్టిఫికెట్ పొంది ఉండాలి.
వచ్చిన తర్వాత: వచ్చిన తర్వాత హోటల్ క్వారంటైన్ లో మొదటి రోజు, ఆరవ రోజున (అన్ని వయస్సుల వారు) PCR పరీక్ష చేయబడుతుంది.
PCR పరీక్షలో నెగిటివ్ వస్తే నిర్బంధం నుండి విడుదల చేస్తారు.
గ్రూప్ B: ప్రీ-అప్రూవ్డ్ అండ్ ఆన్-అరైవల్ వీసాలతో ఖతార్‌కు వచ్చే సందర్శకులు
క్వారంటైన్ పాలసీ:
1. పూర్తిగా టీకాలు వేసిన ప్రయాణికులు: ఈ ప్రయాణికులు ఖతార్ చేరుకున్న తర్వాత 7 రోజుల పాటు హోటల్ క్వారంటైన్‌లో ఉండాలి.
టెస్టింగ్ విధానం:
రాక ముందు: ఖతార్‌కు చేరుకోవడానికి ముందు 72 గంటలలోపు చేయించుకున్న PCR పరీక్షలో నెగిటివ్ వచ్చి ఉండాలి.
వచ్చిన తర్వాత: వచ్చిన తర్వాత హోటల్ క్వారంటైన్లో మొదటి రోజు, ఆరవ రోజున (అన్ని వయస్సుల వారు) PCR పరీక్ష చేయబడుతుంది.
ఈ ఫలితాల్లో నెగిటివ్ వస్తే విడుదల చేస్తారు.
2. టీకాలు వేయని ప్రయాణికులు: ప్రవేశానికి అనుమతి లేదు
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్‌లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్‌మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







