కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో పబ్లిక్ ప్లేస్ లలో 80 శాతం అనుమతి
- November 30, 2021
అబుధాబి: కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్లేస్ లలో ఆంక్షలను సడలించాలని నిర్ణయించింది. రెస్టారెంట్లు, పార్క్ లు, స్పోర్ట్స్ సెంటర్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఎంటర్ టైన్ మెంట్ ప్లేస్ లలో ఇక నుంచి 80 శాతం కెపాసిటీ కి అనుమతించనున్నారు. దీంతో మళ్లీ హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ వ్యాపారం పెరగనుంది. చాలా మంది వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ అనుమతితో అబుధాబి డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ (ADDED) ఈ డిసిషన్ తీసుకుంది. ఐతే హెల్త్ క్లబ్స్, జిమ్ లలో మాత్రం 50 శాతం కెపాసిటీతోనే నడపాలని సూచించింది. రెస్టారెంట్లు, కేఫ్ లలో ఒకే టేబుల్ వద్ద 10 మంది కన్నా ఎక్కువగా కుర్చోవటానికి వీల్లేదని ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకటించింది. ఇక పబ్లిక్ ప్లేస్ లు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ లో పనిచేసే వ్యక్తులందరికీ కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తైన వారే పబ్లిక్ ప్లేస్ లలో రావాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







