డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు..

- November 30, 2021 , by Maagulf
డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు..

ముంబై: ఈ ఏడాదిలో ఇదే ఆఖరు నెల. ఈ ఏడాదిలో పూర్తి చేయాల్సిన బ్యాంకు లావాదేవీలను డిసెంబర్ నెలలో ప్లాన్ చేసుకుంటే వాటిని పూర్తి చేసుకోవడం మంచిది. ఇందుకు సంబంధించి ముందుగా డిసెంబర్ నెలలో ఎన్ని బ్యాంకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు. మరి ఏఏ రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

డిసెంబర్ 5న ఆదివారం సందర్భంగా సెలవు. డిసెంబర్ 11 రెండో శనివారం. డిసెంబర్ 12న ఆదివారం రావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు. డిసెంబర్ 19 ఆదివారం కారణంగా సెలవు. డిసెంబర్ 25 క్రిస్మస్, నాలుగో శనివారం కలిపి వచ్చాయి. మరుసటి రోజు డిసెంబర్ 26 ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.

క్రిస్మస్ సెలవు నాలుగో శనివారం రావడంతో ప్రత్యేకంగా క్రిస్మస్‌ రోజు సెలవు లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో బ్యాంకులకు 6 రోజులు మాత్రమే సెలవులు. అయితే మిగతా రాష్ట్రాల్లో డిసెంబర్ 3న సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ ఫీస్ట్, డిసెంబర్ 18న యు సోసో థామ్ వర్ధంతి, డిసెంబర్ 24, 27 క్రిస్మస్ సంబరాలు, డిసెంబర్ 30న యు కియాంగ్ నాన్గ్‌బాహ్, డిసెంబర్ 31 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా సెలవులు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com