తెలంగాణలో 6 విమానాశ్రయాల స్టేటస్‌ను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- November 30, 2021
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్టేటస్‌ను మంగళవారం నాడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విమానాయానశాఖ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.
ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై స్టడీని పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రదేశాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణం పూర్తి కావడం అనేది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ 2022 డిసెంబర్ వరకు పూర్తవుతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ పూర్తయ్యాక ప్రయాణికుల సామర్థ్యం ఏడాది 1.2 కోట్ల నుంచి 3.4 కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







