డీజిల్‌ దొంగలకు జైలు

- March 22, 2016 , by Maagulf
డీజిల్‌ దొంగలకు జైలు

దోహా క్రిమినల్‌ కోర్ట్‌ శ్రీలంకకు చెందిన ఇద్దరు వలసదారులకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఓ కంపెనీకి చెందిన డీజిల్‌ని దొంగలిస్తున్నారనే అభియోగాలు వీరిపై ఉన్నాయి. భారీ యంత్రం నుంచి డీజిల్‌ని దొంగిలించి, వాహనం ద్వారా తరలిస్తుండగా సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, విచారించి వారి నుంచి సమాచారం రాబట్టారు. వారిపై అభియోగాలు రుజువు కావడంతో ఏడాది జైలు శిక్షను విధించింది న్యాయస్థానం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com