6 లక్షలకుపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు

- November 30, 2021 , by Maagulf
6 లక్షలకుపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం నాడు తెలిపారు.లోకసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.విదేశాంగ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 1.33 కోట్లకు పైగా భారతీయులు విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు.ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. 2017లో 1,33,049 తమ భారత పౌరసత్వాన్ని ఒదులుకోగా..2018లో 1,34,561.. 2019లో 1,44,017.. 2020లో 85,248 తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 1,11,287 మంది ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే..విదేశాల్లో భారత సంతతి వారు తమ తమ రంగాల్లో విజయం కేతనం ఎగరేస్తున్నారు.ప్రస్తుతం అనేక అంతర్జాతీయ టెక్ కంపెనీలకు నేతృత్వం వహిస్తోంది భారతీయులు లేదా భారతీయ సంతతికి చెందిన వారే! గూగుల్,మైక్రోసాఫ్ట్,ఐబీఎమ్,అడోబీ,వీఎమ్‌వేర్, వంటి సంస్థలకు ఇండియన్లు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com