అంతర్జాతీయ విమానాల పై నిషేధం పొడిగింపు
- December 01, 2021
న్యూ ఢిల్లీ: డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు బుధవారం పౌర విమానయాన నియంత్రణ సంస్థ(DGCA)ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న సమయంలో అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. విమానాల పునరుద్ధరణ ఎప్పటి నుంచి అనేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది.
కాగా,కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని గత నెలలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఇటీవల ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోఅంతర్జాతీయ విమానాల పునరుద్ధరణను డీజీసీఏ వాయిదా వేసింది.అయితే,28 దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా కొన్ని నిర్దేశించిన దేశాలకు మాత్రమే ప్రస్తుతం భారత్ నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!







