కరోనా కొత్త మెడిసిన్ కు ఆమోదం

- December 02, 2021 , by Maagulf
కరోనా కొత్త మెడిసిన్ కు ఆమోదం

అబుధాబి: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న కాస్త రిలీఫ్ ను ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా  సోకి మైల్డ్ సింప్టమ్స్ ఉన్న పేషెంట్ల ట్రీట్ మెంట్ లో ఉపయోగించేందుకు మరో కొత్త మెడిసిన్ కు  డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ - అబుధాబి (DoH) ఆమోదం తెలిపింది. స్విస్ బయోటెక్ కంపెనీ రోచె దీనిని తయారు చేసింది. తేలికపాటి నుంచి మధ్యస్థ  లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్ల కు ట్రీట్ మెంట్ లో ఇది మంచి ఫలితాలను ఇస్తుందని DoH తెలిపింది. కొత్త మెడిసిన్ ను  మోనోక్లోనల్, యాంటీబాడీస్‌ తో తయారు చేశారు. అసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ బ్రాండ్ పేర్లతో మార్కెట్లో ఈ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com