విదేశీ కార్మికుల రిక్రూట్ మెంట్ లో ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు
- December 02, 2021
సౌదీ: చట్టవిరుద్ధంగా విదేశీ కార్మికులను రిక్రూట్ చేసుకున్న కంపెనీలు, దుకాణాల ఓనర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) తెలిపింది.లేబర్, రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే సౌదీ రియాల్ 1,00,000 ఫైన్ వేయడంతోపాటు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. డిఫాల్ట్ చేసిన సంస్థలు ఐదేళ్ల వరకు ఫారిన్ ఎంప్లాయిస్ ను రిక్రూట్ చేసుకోకుండా నిషేధిస్తామని తెలిపింది. రెసిడెన్సీ, లేబర్ అండ్ బార్డర్ సెక్యూరిటీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని తెలుపాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మక్కా,రియాద్ ప్రాంతాలలో ఐతే 911 నంబర్‌కు.. ఇతర ప్రాంతాలలో వారు 999 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







