బసవతారకంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన బాలకృష్ణ
- December 02, 2021
హైదరాబాద్: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… కోవిడ్ మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్నారు.
ఆక్సిజన్ ను విమానాలలో ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించి దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆక్సిజన్ సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చూడడానికి ఈ సరికొత్త ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫార్మా సంస్థ అందించిన కోటి 20 లక్షల ఆర్థిక సహాయంతో ఈ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







