ఒమిక్రాన్ వేరియంట్...బూస్టర్ డోస్ ఉత్తమం: WHO
- December 02, 2021
జెనీవా: యావత్తు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కరోనా మహమ్మరి రూపాంతరం చెంది మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు పలు దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది.నేడు ఇండియాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పలు సూచనలు చేసింది. దక్షిణాఫ్రికాలోని యువత తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించింది.
కరోనా వేరియంట్లతో పొల్చితే ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉన్నయని తెలిపింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారికి, ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ వైరస్ సోకుతోందన్నారు. అంతేకాకుండా రెండు డోసులు తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్ సోకిందని కానీ వారిలో చాలా స్వల్ప స్థాయిలో లక్షణాలు కనిపించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ ఉత్తమమని డబ్లూహెచ్ఓ అభిప్రాయం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







