కోవిడ్ 19 ఒమైక్రాన్ వేరియంట్: బూస్టర్ డోసులు పొందే విధానమిదీ..

- December 03, 2021 , by Maagulf
కోవిడ్ 19 ఒమైక్రాన్ వేరియంట్: బూస్టర్ డోసులు పొందే విధానమిదీ..

యూఏఈ: యూఏఈలో పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన ఓ మహిళకు తొలిసారిగా కోవిడ్ 19 ఒమైక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. రెండు డోసులు పొందినవారికీ ఒమైక్రాన్ సోకే అవకాశం వున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు. బూస్టర్ డోసులుగా ఫైజర్ బయో ఎన్ టెక్ మరియు స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయి. కోవిడ్ 19 వ్యాక్సిన్ యూఏఈలో ఉచితమే. బూస్టర్ డోసులు కూడా ఉచితమే. పూర్తిగా వ్యాక్సినేషన్ (రెండు డోసులు) పొందినవారు బూస్టర్ డోసుకి అర్హులు. 18 ఏళ్ళు పైబడినవారికి, రెండో డోస్ ఫైజర్ లేదా సినోఫామ్ లేదా స్పుత్నిక్ వ్యాక్సిన్ పొందినవారికి.. రెండో డోస్ పొందిన ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ ఇస్తారు. అపాయింట్మెంట్ ద్వారా బూస్టర్ డోస్ పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com