ఆన్లైన్ పేమెంట్ చేసేవారికి గూగుల్ కీలక ప్రకటన..
- December 03, 2021
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి బిల్లును కూడా డిజిటల్ చెల్లింపుల యాప్‌ల నుంచి చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్, ఇతర మార్గాల ద్వారా పేమెంట్లు చేసేవాళ్లకు గూగుల్ కీలక సూచన చేసింది. 2022 జనవరి 1 నుంచి వినియోగదారులు కార్డు వివరాలు సేవ్ చేయబోమని స్పష్టం చేసింది. ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డు, ఏటీఎంల చెల్లింపుల విషయంలో ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే సాధారణ ప్రతి కార్డుదారుడు పేమెంట్ చేసిన తర్వాత నెలనెల పేమెంట్లు చేసే సమయంలో కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్ అనేవి ఆటోమేటిక్‌గా కనిపిస్తుంటాయి. ఇతర కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ అవుతుంది. అయితే ఇక నుంచి గూగుల్ యాప్‌లో ఇలాంటి అంశాలేమి కనిపించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కార్డు స్టోరేజీ రెగ్యులేషన్స్‌ను పాటిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది.
ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలి..
కాగా, గూగుల్ ప్లే అకౌంట్, గూగుల్ వర్క్ అకౌంట్, గూగుల్ క్లౌడ్‌లో రికార్డు అయిన వివరాలు పని చేయవు. 2022 జనవరి నుంచి ఇదే కార్డును ఉపయోగించుకునేవాళ్లు ఎప్పటికప్పుడు కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని గూగుల్ తెలిపింది. భారత్‌లో అధికంగా ఉపయోగించేది వీసా, మాస్టర్ కార్డులే ఉన్నాయి. వీటి విషయంలో కొంత ఊరట కలిగించింది. వీసా, మాస్టర్ కార్డులకు సంబంధించిన డేబిట్, క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయాలనుకుంటే ఈనెల 31లోపు కార్డు వివరాలు రీ-ఎంటర్ చేయాలని, ఆ తర్వాత పేమెంట్ చేస్తే ఆ వివరాలు కొనసాగుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







