యూఏఈకి 80 రాఫెల్ ఫైటర్ జెట్స్.. ఫ్రాన్స్ తో భారీ అగ్రిమెంట్
- December 04, 2021
యూఏఈ: ఫ్రాన్స్ నుంచి 80 రాఫెల్ ఫైటర్ జెట్ లను కొనేందుకు యూఏఈ భారీ అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో యూఏఈ ఎయిర్ ఫోర్స్ మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం విలువ 66 బిలియన్ దిర్హాములు(16 బిలియన్ యూరోలు) కావడం విశేషం.యూఏఈ-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందం చారిత్రాత్మకమని, ఇప్పటి వరకు ఫ్రాన్స్ కు ఇదే అతిపెద్ద ఆయుధ ఎక్స్ పోర్ట్ అగ్రిమెంట్ అని ఫ్రాన్స్ కొనియాడింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దుబాయ్ ఎక్స్ పో 2020 విజిట్ చేసిన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తున్న ఈ ఫైటర్ జెట్స్ 2026-2031 మధ్య యూఏఈ ఎయిర్ ఫోర్స్ చేతికి విడతల వారిగా అందనున్నాయి. దీంతో ఫ్రాన్స్ తర్వాత రాఫెల్ ఎఫ్4 ఫైటర్స్ జెట్స్ వాడే తొలి దేశంగా యూఏఈ నిలబడనుంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







