యూఏఈ గోల్డెన్ జూబ్లీ రిసెప్షన్‌.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు

- December 04, 2021 , by Maagulf
యూఏఈ గోల్డెన్ జూబ్లీ రిసెప్షన్‌.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు

న్యూఢిల్లీ: ఇండియాలోని యూఏఈ ఎంబసీలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ఇండియాలో యూఏఈ అంబాసిడర్ డాక్టర్ అహ్మద్ అల్ బన్నా నిర్వహించిన రిసెప్షన్‌కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ యూఏఈ ప్రజలకు ఇండిపెండెంట్ గ్రీటింగ్స్ తెలిపారు. అలాగే యూఏఈ ఎక్స్ టెర్నర్, ఇంటర్నేషనల్ సహకార మినిస్టర్ H.H. షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు అభినందనలు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్నసమగ్ర వ్యూహాత్మక రిలేషన్ కొత్త శిఖరాలకు చేరుతుందని నమ్మకంగా ఉందని సోషల్ మీడియాలో జైశంకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాటలను  డాక్టర్ అల్ బన్నా గుర్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 2016లో షేక్ మొహమ్మద్ తొలిసారిగా ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘యూఏఈ డెవలప్ మెంట్ లో ఇండియన్స్ కూడా భాగం’ అని అన్నారు. ఎమిరాటీ గాయకుడు అబ్దుల్లా అల్ షమ్సీ తన పాటలతో రిసెప్షన్‌లో అందరినీ అలరించారు. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com