ఒమిక్రాన్ భయం...‘న్యూ ఇయర్ ట్రావెల్ షెడ్యూల్’ లో గందరగోళం
- December 04, 2021
కువైట్: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. కువైట్ ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీని భారీగా దెబ్బతీసింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఒమిక్రాన్ భయం కువైటీల న్యూ ఇయర్ ట్రావెల్ షెడ్యూల్ ను సందిగ్ధంలో పడేసింది. దాదాపు 20 శాతం ప్రజలు కొత్త వేరియంట్ భయంతో తమ ప్రయాణాలపై నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. న్యూ ఇయర్ సెలవుల కోసం ట్రావెల్ రిజర్వేషన్ల విషయానికొస్తే.. టర్కీ, కైరో లకు ఈసారి డిమాండ్ తక్కువగా ఉంది. దుబాయ్‌కి టిక్కెట్ ధరలు అధికంగా ఉన్నందన కువైటీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2020తో పోలిస్తే.. 2021 జనవరి నుండి సెప్టెంబర్ వరకు సుమారు 115 శాతం అమ్మకాలు(101 మిలియన్ల కువైటీ దినార్లు) పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గడంతో పుంజుకుంటున్న ట్రావెల్ రంగాన్ని ఒమిక్రాన్ భయం భారీ దెబ్బ కొట్టిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కువైట్ లో 430 ట్రావెల్ ఆఫీసులు ఉన్నాయి. కరోనాతో నెలవారి అమ్మకాల్లో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 34 మిలియన్ల కువైటీ దినార్లు నష్టపోయాయి. అయితే కువైట్ లో మెజారిటీ ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తికావడం, ఇంటర్నేషనల్ ట్రావెల్ కండిషన్లు వీరికి అనుకూలంగా ఉన్నందునా మున్ముందు ఆశాజనకంగా ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







