వాట్సాప్ అదిరిపోయే ఆఫర్..
- December 05, 2021
వాట్సాప్.. ఇది లేని స్మార్ట్‌ఫోన్ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇందులోని మునిగి తేలుతుంటారు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఉండాల్సిందే. ఇక యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ సంస్థ రోజరోజుకు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తోంది. ఈ తాజాగా వాట్సాప్‌లో పేమెంట్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాట్సాప్ వాడేవారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. డబ్బులను బదిలీ చేస్తే క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్లు తెలిపింది. గత కొద్ది రోజుల క్రితమే.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ సేవలను ప్రారంభించింది. అయితే ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది వాట్సాప్.
నగదు బదిలీ చేసినప్పుడు 51 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే కేవలం ఒక రూపాయి పంపించినా కూడా క్యాష్ బ్యాక్ లభించడం విశేషం. అయితే.. ఈ ఆఫర్ ఐదు ట్రాన్సాక్షన్ల వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది వాట్సాప్ సంస్థ. డబ్బులు పంపించిన వెంటనే ఆ క్యాష్ బ్యాక్ మన ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలోనే ఈ క్యాష్ బ్యాక్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫోన్ పే, గూగుల్ పే సైతం మొబైల్ పేమెంట్స్ ప్రారంభించిన సమయంలో క్యాష్ బ్యాక్ అందించాయి.దీంతో అవి వినియోగదారులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ సైతం ఆ వినియోగదారులను తన వైపు తిప్పుకునేందుకు అదే దారిలో వెళ్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







