ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్..
- December 06, 2021
ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీమ్ పోస్టర్..
హైదరాబాద్:ఇద్దరూ స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్ నెట్టింట్లో సంచలనం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ముందుగా ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది.కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు.ఆ తర్వాత డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చేయనున్నట్లుగా ప్రకటించారు.ట్రైలర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.రక్తంతో తడిచిన శరీరంతో రెండు చేతులతో తాడులను ఆగ్రహంతో కనిపిస్తున్నాడు తారక్. ఇక ఎన్టీఆర్ కొమురం భీమ్ లేటేస్ట్ పోస్టర్ అదిరిపోయిందంటూ తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.ఇక సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







