46 దేశాలకు పాకిన కొత్త వేరియంట్...
- December 06, 2021
న్యూ ఢిల్లీ:భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. జెట్ స్పీడ్‌తో ఇది విస్తరిస్తోంది.రోజురోజుకూ ఈ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 17 కేసులు నమోదయ్యాయంటే న్యూ వేరియంట్ ఎంతలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిన్న మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకలో 2, గుజరాత్, ఢిల్లీల్లో ఒక్కో కేసు వెలుగులోకొచ్చింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది.
దేశంలో న్యూ స్ట్రెయిన్ విజృంభణతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బూస్టర్ డోస్‌కు కసరత్తు చేస్తోంది. ఇవాళ కొవిడ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. బూస్టర్ డోస్‌తో పాటు చిన్నారుల వ్యాక్సిన్‌పైనా కమిటీ సభ్యులు చర్చించనున్నారు.
మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా న్యూ వేరియంట్‌పై అలర్ట్ అయ్యియ. మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశించాయి. ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్ తీవ్ర రూపం దాల్చే అవకాశముందని ప్రకటించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. వచ్చే 6 వారాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ టెన్షన్ పెట్టిస్తోంది. ఇప్పటికే 46 దేశాలకు పాకింది ఒమిక్రాన్ వేరియంట్. ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా 941కి చేరిన బాధితుల సంఖ్య. యూకేలో 246, దక్షిణాఫ్రికాలో 228, జింబాబ్వేలో 50, యూఎస్‌లో 39 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..