పొగమంచు

- December 07, 2021 , by Maagulf
పొగమంచు

చెట్లగుబురులు చిక్కని మల్లెమాలలా 
అల్లుకున్న హంసవర్ణపు పొగమంచు
ప్రకృతి నేస్తాలయిన ఋతువుల 
పలకరింపు ఏ ఋతువు ప్రత్యేకం దానిదే
ప్రతి యేడు వసంతంలా రానేవచ్చింది
చలి విసిరింది తన పంజా బాణంలా 
తొలివేకువలో వీచే చల్లని పిల్లగాలులు 
పక్షుల కిలకిలరావాలు పువ్వులపై కురుస్తున్న 
చిరు బిందువులు కమనీయ దృశ్యాలు 
భానుడి రవికిరణాలు ఆ చిరుచీకట్లు 
తరుముతున్న కాలంతో సంబంధం 
లేకుండా ఏ వయసు వారైనా భగభగ
మండే  వెచ్చటి చలిమంటలు కాచుకుంటు
ఓ రమ్యమైన అనుభూతితో ఆస్వాదిస్తు
ఆ మంట చుట్టూ చేరి కష్ట సుఖాలని
మరచి సరదాగా మురిసిపోయే క్షణాలు
ఈ హిమమంచు ప్రేమికులకి ఓ తియ్యని ఆనందమే. 

--యామిని కొళ్లూరు(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com