ఒమన్-సౌదీ అరేబియా రోడ్డు ప్రారంభం
- December 08, 2021
మస్కట్: ఒమన్-సౌదీ రోడ్డును ఒమన్ సుల్తానేట్, సౌదీ అరేబియా ప్రారంభించాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. అల్ దహిరా గవర్నరేట్‌లోని ఇబ్రి రౌండ్ అబౌట్‌లో రోడ్డు ప్రారంభమై సౌదీ బాతా కూడలిలో ముగుస్తుంది. 725 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు రెండు దేశాల మధ్య రాకపోకలను మరింత మెరుగు పరుస్తుంది. పబ్లిక్, గూడ్స్ ట్రాన్స్ పోర్టు వాహనాలు సాఫీగా సాగడానికి దోహదపడుతుంది. రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి సయీద్ బిన్ హమూద్ బిన్ సయీద్ అల్ మావలీ మాట్లాడుతూ.. ఈ రోడ్డు ప్రారంభం ద్వారా రెండు సోదర దేశాల మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. ఎకనామిక్, ఫైనాన్షియల్, టూరిజం, ఇన్వెస్ట్ మెంట్ రంగాలకు మద్దుతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ రోడ్డు మార్గం ఒమన్ సుల్తానేట్‌లోని నెట్‌వర్క్ ఒమానీ పోర్ట్ లు, ఫ్రీ జోన్‌లు, ఎయిర్ పోర్టులతో కలుపుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!







