గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50 దిర్హాం కొత్తనోటును రిలీజ్ చేసిన సెంట్రల్ బ్యాంక్

- December 08, 2021 , by Maagulf
గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50 దిర్హాం కొత్తనోటును రిలీజ్ చేసిన సెంట్రల్ బ్యాంక్

యూఏఈ: గోల్డెన్ జూబ్లీ(50 సంవత్సరాలు) దినోత్సవాన్నిపురస్కరించుకుని UAE సెంట్రల్ బ్యాంక్ 50 దిర్హాం కొత్త నోటును విడుదల చేసింది. ఈ నోటుపై ఫౌండింగ్ ఫాదర్ దివంగత షేక్ జాయెద్ ఫోటోని ముద్రించారు. మరోపక్క ఎమిరేట్స్ మొదటి తరం రూలర్స్ చిత్రాన్ని ముద్రించారు. దేశాన్ని ఏకం చేయడంలో వారి అంకితభావం, చారిత్రక పాత్రను గౌరవించేలా కొత్త నోటును సెంట్రల్ బ్యాంక్ తీసుకొచ్చింది. దీన్ని తొలిసారి పాలిమర్ మెటీరియల్‌తో తయారు చేశారు. అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో రూపొందించారు. కొత్త నోటు త్వరలోనే సెంట్రల్ బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న 50 దిర్హం నోటు కూడా చెల్లుబాటు అవుతుందని సెంట్రల్ బ్యాంక్ చెప్పింది.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com