వీకెండ్ మీ ఇష్టం.. ప్రైవేట్ కంపెనీలకు వెసులుబాటు
- December 08, 2021
యూఏఈ: ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు తమకు నచ్చిన వీకెండ్ ను ఎంచుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. దీంతో కంపెనీలు, ఉద్యోగుల మధ్య పోటీ తత్వం పెరుగుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగున్నర రోజుల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేట్ సెక్టర్ కు సైతం వర్కింగ్ అవర్స్ ని ఎంచుకునే స్వేచ్ఛను యూఏఈ కల్పించింది. శనివారం, ఆదివారంతోపాటు శుక్రవారం సగం దినం మాత్రమే పనిదినాలను యూఏఈ కొత్తగా ప్రకటించింది. కొత్త వీకెండ్ విధానానికి అనుగుణంగా యూఏఈ సెంట్రల్ బ్యాంకు ఇకపై నాలుగున్నర రోజులు మాత్రమే పనిచేస్తుందని ప్రకటించింది. పబ్లిక్ సెక్టార్ లో తక్కువ పనిగంటలు (36 గంటలు) ప్రవేశ పెట్టిన మొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించింది. యూఏఈ హెచ్ఆర్ అండ్ ఎమిరేటైజేషన్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వీకెండ్ ను ఎంచుకునే వెసులుబాటును ఇచ్చామని చెప్పారు. వీకెండ్ మార్పు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లకు మరింత ఊపు వస్తుందని, యూఏఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..