ఎయిర్ ఇండియా వన్ విమానాయాన సంస్థ సిబ్బంది డ్రస్‌కోడ్‌ను మార్చనుంది..
- March 23, 2016
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీల అధికారిక విమానం ఎయిర్ ఇండియా వన్ విమానాయాన సంస్థ తన సిబ్బంది డ్రస్‌కోడ్‌ను మార్చనుంది. దేశీయ, ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే సిబ్బందికి అవసరమైన ఖాదీ వస్త్రాలకు సంబంధించిన ఆర్డరును ఇచ్చినట్లు సమాచారం. మహిళా సిబ్బందికి సిల్కు చీరలు, పురుషులకు జోధ్‌పురి బంద్‌గల కోట్లు, జాకెట్లు అన్నింటినీ ఖాదీ వస్త్రాలతో రూపొందించమని ఆర్డర్ ఇచ్చారు. ఎయిర్‌ఇండియా సిబ్బందికి ఖాదీ వస్త్రాలను పరిచయం చేయడంతో పాటు. ముఖ్యంగా యువతకు ఖాదీ వస్త్రాలపై అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను వచ్చే వారంలో విడుదల చేయనున్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో మహాత్మగాంధీకి నివాళిగా ఖాదీ ఉత్పత్తుల వినియోగం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో మాట్లాడిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







