లాంగ్ వీకెండ్.. న్యూ ఇయర్ కి 3 రోజులు హాలిడే

- December 09, 2021 , by Maagulf
లాంగ్ వీకెండ్.. న్యూ ఇయర్ కి 3 రోజులు హాలిడే

యూఏఈ: ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మూడు రోజులపాటు ఎంజాయ్ చేయొచ్చు. దీని కారణం యూఏఈలో కొత్త సంవత్సరం నుంచి  నాలుగున్నర రోజుల పని వేళలు జనవరి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 శుక్రవారం కాబట్టి ఆ రోజు హాలీడే. ఇక జనవరి 1 (శనివారం), జనవరి 2(ఆదివారం) కూడా కొత్త వీకెండ్ కండిషన్స్ ప్రకారం సెలవులు. దీంతో వరుసగా మూడు రోజులపాటు పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్స్ ఉద్యోగులు సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ సారి మూడు రోజులపాటు హాలీడేని ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. దీంతో చాలా మంది ఇప్పటి నుంచే తమ టూర్స్, సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com